ఫైర్ స్టేషన్ కు ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ అందజేత..

నవతెలంగాణ – డిచ్ పల్లి
అత్హంగ్ డిచ్ పల్లి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ అద్వర్యంలో కార్పోరేషన్ సోషల్ రెస్పాన్సిబుల్ ( సిఎస్ అర్) ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామ స్వాగత తోరణం వద్ద ఉన్న అగ్నిమాపక శాఖ కు బుధవారం ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ లను అందజేశారు. (ఫోల్డబుల్ స్ట్రెచెర్స్ -20, సేఫ్టీ బెల్ట్ -25, అంబూ బ్యాగ్స్-25)లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అత్హంగ్ టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజర్ అనిల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ అగ్ని ప్రమాద సమయం లో అగ్ని మాపక సిబ్బంది చేస్తున్న సహాయానికి తాము ఈ వస్తువులను మేము ఇవి అందజేస్తున్నామని వివరించారు.  అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ భను ప్రతాప్ మాట్లాడుతూ.. ఈ అత్యవసర వస్తువులు అందజేసినందుకు
ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ మేనేజర్ సతీష్, రూట్ ఆపరేషన్ మేనేజర్ విరాజ్ దేశ్పండే, టోల్ ప్లాజా మేనేజర్ చలపతి రావు, మేయింటినెన్స్ మేనేజర్ కృష్ణకాంత్, నారాయణ మూర్తి, ఫైర్ ఇన్స్పెక్టర్ సురేష్, అగ్ని మాపక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం ఘనంగా శాలువాతో సన్మానించారు.