పేద కుటుంబానికి అత్యవసర సరుకులు అందజేత 

నవతెలంగాణ – తాడ్వాయి 
మండలంలోని కాటాపూర్ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్బి-మౌలానా అనే నిరుపేద ముస్లిం దంపతులకు దామెరవాయి గ్రామానికి చెందిన యువతులు రూ.700 రూపాయల విలువ చేసే నిత్యవసర సరుకులు బుధవారం అందించారు. గతంలో జ్వాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాట్సప్ ద్వారా సహాయం కోరిన ఈ దంపతులకు తెలుసుకొని సాయ సహకారాలు అందించారు. జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ మెంబర్ దగ్గరుండి సరుకులను వారితో ఇప్పించారు. ఎవరైనా సహాయ సహకారాలు ఉంటే ఈ దంపతులకు అందించాలని కోరారు. ఈ విషయాన్ని జ్వాలా ట్రస్ట్ తాడ్వాయి మండలం కమిటీ అధ్యక్షులు మూడు నాగేశ్వరరావు కృష్ణ బిక్షపతి తిరుపతి వారిని అభినందించారు.