నవతెలంగాణ పెద్దవంగర: ఇటీవలి కాలంలో కురిసిన భారీ వర్షాలకు మండల పరిధిలోని పోచంపల్లి గ్రామానికి చెందిన పిండి యాకయ్య, పిండి శ్రీను వరదలో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరూ మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగ రామ్మోహన్ రెడ్డి గురువారం పరామర్శించి, రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబ సభ్యులకు బీజేపీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కన్వీనర్ సుంకరనేని కోటేశ్వర్ రావు, మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు, మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన సుధాకర్, తలారి సోమయ్య, సాయిని ఝాన్సీ రవి, దేవరుప్పుల ప్రధాన కార్యదర్శి కాసాని సత్తన్న యాదవ్, రాజు, యాకాంబ్రం, కవిరాజు, సాయి, తరుణ్, అనిల్ ,రాకేష్, మహేష్, సంపత్, శ్రీకాంత్, సుమన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.