నవతెలంగాణ – జన్నారం
మండలంలోని హనుమాన్ ఆలయం వద్ద గత కొన్ని సంవత్సరాల నుండి శుద్ధి చేస్తున్న కట్ల లింగన్న, భార్య మరణించడంతో ఆ పేద కుటుంబానికి హనుమాన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆదివారం రూ.5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ పేద కుటుంబాన్ని ఆదుకుంటామని గణేష్ మండలి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో గణేష్ మండలి కమిటీ సభ్యులు గాజుల దేవేందర్, వాసాల నరేష్ గట్టు మహేష్ ముంజంపల్లి సాయికుమార్, పెట్టం రమేష్, చౌక మహేష్, ఓడిపెళ్లి రాజేష్, అనుమండ్ల నాగరాజు, ఉల్వకాని మల్లేష్ అంకం మహేష్ ామని అఖిల్, తుమ్మ సతీష్, సురిమిళ్ళ భాస్కర్, అన్నారపు అశోక్, అన్నారపు పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.