నామమాత్రపు చార్జీలతో మధ్యతరగతి ఖాతాదారులకు రుణాలు అందించడం అభినందనీయమని పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మంగళవారం అన్నారు . పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యందు ఖాతాదారు అయిన ముల్కీ గంగజమున కు లక్ష రూపాయల చెక్కును అందజేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష రూపాయల ప్రమాద బీమా ద్వారా ఖాతాదారుల కుటుంబాలకు బాధ్యతని నిర్వర్తించడం అభినందనీయమని, కేవలం 9 శాతం నెలసరి వడ్డీకే బంగారు ఆభరణాలపై రుణాలను అందిస్తున్నామని, వినియోగదారులకు 24 గంటలు ఏటీఎంలో నగదు అందుబాటులో ఉంచి పరిసర ప్రాంత ప్రజల నగదు అవసరాలను తీరుస్తున్నారని అన్నారు. బ్రాంచి మేనేజర్ చందూర్ రాజశేఖర్ మాట్లాడుతూ మైక్రో ఏటీఎం, ఏ ఈ పి ఎస్ సేవల ద్వారా వినియోగదారులకు చెల్లింపులు చేయడం జరుగుతుందని, సేవింగ్ కథలు ప్రారంభించుటకు కావలసిన ఫోటో జిరాక్స్లను బ్యాంకు యందు ఉచితంగా అందజేస్తున్నామని, వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధికై రుణాలను అందిస్తున్నామని, పరిసర గ్రామాలలోని 17 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించామని, పెన్షనర్ల, ఇతర ఖాతాదారులు ఇట్టి బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వద్ద బ్యాంకు లావాదేవీలను నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.