పాఠశాలకు సౌండ్ సిస్టం అందజేత 

నవతెలంగాణ కుభీర్: మండలంలోని పార్డి (బి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేసిన తెలుగు ఉపాద్యాయురాలు మాలతి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పదోన్నతి పొందారు. శనివారం ఆమె ఇంత కాలం పనిచేసిన పాఠశాలకు తన గుర్తుగా రూ.18 వేల విలువతో కూడిన సౌండ్ సిస్టంను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రదనోపాధ్యాయులు నారాయణ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు విరాళం అందజేసిన మాలతి శ్రీనివాస్ రెడ్డి దంపతులకు పాఠశాల తరుపున కృతజ్ఞతలు తెలపారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు ఎస్.నారాయణ్ రెడ్డి, ఉపాద్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.