
భిక్కనూరు మండల కేంద్రంలోని క్రీడాకారులకు శుక్రవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా ప్రతినిధి గంగల రవీందర్ ముదిరాజ్ ఆట వస్తువులు, వాలీబాల్, నెట్ నీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు అన్నివిధాలుగా అండగా ఉంటానని, త్వరలోనే రెండు ఎలక్ట్రికల్ పోల్స్, లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, రోహిత్, అంజు సింగ్,సాగర్, వంశీ భరత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.