వివిధ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు అందజేత

నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలోని, విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం మండలంలోని వివిధ పాఠశాలలకు, ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు అందజేస్తున్న పాఠ్యపుస్తకాలను, ఆయా పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజులు, ఉపాధ్యాయులు కృష్ణ మోహన్, చందు, షకీల్, శ్రీహరి, సిఆర్ పిలు మహమ్మద్, సురేఖ, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.