
మండల కేంద్రంలోని హాస కొత్తూర్ చౌరస్తాలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద శనివారం ప్రయాణికుల సౌకర్యార్థం సిమెంటు కుర్చీలను ఏర్పాటు చేశారు. మండల పద్మశాలి సంఘం తరపున ఈ సిమెంట్ కుర్చీలను ఏర్పాటు చేసినట్లు మండల అధ్యక్షులు చింత తిరుపతి తెలిపారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు బస్సుల కోసం వేసి చూసే సమయంలో వారికి సౌకర్యంగా కూర్చొని వేచి ఉండేందుకు వీలుగా రెండు సిమెంటు కుర్చీలను ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ముందు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. సిమెంట్ కుర్చీలను మండల పద్మశాలి సంఘం సభ్యులతో కలిసి ప్రారంభించినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల కోశాధికారి పోతు ధరణి కుమార్, మండల సభ్యులు చింత గణేష్, కమ్మర్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు చింత శ్రీనివాస్, ఉప్లూర్ ఓం మార్కండేయ సంఘం అధ్యక్షులు పోతు లింగమూర్తి, బషీరాబాద్ గ్రామ శాఖ అధ్యక్షులు పద్మా రవి, కమ్మర్ పల్లి శాఖ కార్యవర్గ సభ్యులు గట్టు శంకర్, తదితరులు పాల్గొన్నారు.