ప్రభుత్వ వైద్య కళాశాలలో 32 పోస్టులకు ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్

– టీమ్ సెక్రటరీ సభ్యురాలు శాంతి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 32 పోస్టులకు సంబంధించిన ప్రొవిజినల్ మెరిట్ లిస్టును https://yadadri.telangana.gov.in/ వెబ్సైట్ నందు ప్రదర్శించిన టీమ్ సభ్యురాలు శాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ  ప్రొవిజినల్ మెరిట్ లిస్టుకు సంబంధించి ఏమైనా అభ్యంతరముల ఉన్నచో తేదీ: 23-07-2024 నుండి 24-07-2024 వరకు రెండు పని దినములలో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం యందు గల తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెంట్ మిషన్ కార్యాలయం, రూమ్ నెంబర్ F8, మొదటి అంతస్తు, కలెక్టరేట్ నందు పని వేళలో వ్రాతపూర్వకముగా వారి యొక్క అభ్యంతరములను సమర్పించగలరు.   గడువు దాటి వచ్చిన అభ్యంతరములు స్వీకరించబడవని తెలిపారు.