ఉపాధ్యాయుడి కుటుంబానికి పిఆర్టియు భరోసా

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ పండిత్ ఉపాధ్యాయులు ఉదయ్ దత్ స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆకస్మికంగా మరణించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పి ఆర్ టి యు ఆధ్వర్యంలో సంతాప సభను నిర్వహించారు. పి ఆర్ టి యు లో క్రీయశీల సభ్యత్వం ఉన్నందున ఎమ్మెల్సీ రగోతం రెడ్డి, పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ పాల్ రెడ్డి, కమలాకర్ రావు చేతుల మీదుగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతకుముందు ఉపాధ్యాయ వృత్తిలో ఉదయ్ దత్ చేసిన సేవలు గురించి కొనియాడి, శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దామోదర్ రెడ్డి, కుషాల్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ చారి, గిరిధర్, మండల విద్యాధికారి ఎల్లయ్య, పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ బృందం, సి ఓ సంపత్, తదితరులు పాల్గొన్నారు.