మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఆర్టియూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించినట్లు పీఆర్టియూ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఆర్టియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పీఆర్టియూ ముందుంటుందని,317 జీఓ బాధితులను స్వంత జిల్లాలకు తీసుకొస్తామని,2003 డీఎస్సి ఉపాద్యాయులకు పాత పెన్షన్ ఇప్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి,ఆర్మూర్ డివిజన్ ఇంచార్జి లక్ష్మణ్ పటేల్,ఏర్గట్ల మండల మాజీ అధ్యక్షులు శేర్ల శ్రీనివాస్,పీఆర్టియూ నాయకులు దశెంధర్,గటాడి భాస్కర్,సుధాకర్,రాజశేఖర్,సురేష్,పవన్ తదితరులు పాల్గొన్నారు.