పిఆర్టియు సభ్యత్వం ఓ వరం సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి

నవతెలంగాణ – నసూరుల్లాబాద్ 
తెలంగాణ రాష్ట్రంలో పిఆర్టియు సభ్యత్వం నమోదు ఒక వరం లాంటిదని పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ తెలిపారు. గురువారం నసూరుల్లాబాద్ మండలంలోని నెమ్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా చేపట్టారు . ఈ సందర్భంగా  విరామ సమయంలో ఏర్పాటుచేసిన ఉపాధ్యాయుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ మాట్లాడుతూ.. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసేలా సంఘం చేసిన కృషిని వివరిస్తూ సభ్యత్వం స్వీకరించాల్సిందిగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మధ్యంతర భృతి ఇప్పించడం, సిపిఎస్ రద్దుకై కార్యచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, పెండింగ్ బిల్లుల సమస్య ఈ నెలాఖరులోపు పరిష్కారం అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఉపాధ్యాయులు పి ఆర్ టి యు సభ్యత్వం తీసుకోవడం ఒక వరం లాంటిదని ప్రతి ఉపాధ్యాయుడు సభ్యత్వం తీసుకోవాలని ఆయన కోరారు.  ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం పి ఆర్ టి యు అని అన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా సభ్యత్వంతో పాటు సభ్యత్వం పొందిన ప్రతి ఉపాధ్యాయునికి గ్రూప్ ఇన్సూరెన్స్ రక్షణ ఉండాలనే ఉద్దేశంతో క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోనే పటిష్ట మైన పి. ఆర్.టి.యు సంఘం ఉపాధ్యాయుల, విద్యా రంగ సమస్యల సాధనకై ముందుండి పాఠశాల పతిష్టతకు విద్యాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జి. హన్మాండ్లు, రాష్ట్ర నేతలు, వెంకగౌడ్, హన్మాడ్లు, శ్రీనివాస్ , సుజాత, శ్రీచంద్ తదితరులు పాల్గొన్నారు.