పిఆర్‌టియు సభ్యత్వ నమోదు స్పందన 

నవతెలంగాణ- నసురుల్లాబాద్ 
నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లీ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పిఆర్‌టియు టిఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్టు పిఆర్‌టియు మండల అధ్యక్షుడు గునిగెరి హన్మండ్లు తెలిపారు. పిఆర్‌టియు టిఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కుషాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కుషాల్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళుతూ పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, పిఆర్‌టియు టిఎస్‌ కృషి వల్లనే పిఆర్‌సి అమలు సాధ్యమైందన్నారు. పిఆర్‌టియు అతి పెద్ద సంఘం ఉపాధ్యాయుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిందన్నారు.. పిఆర్‌టియు టిఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం కు విశేష స్పందన వస్తుందన్నారు. ఈ  కార్యక్రమంలో మండల నాయకులు హాన్మండ్లు, భూషణ్, వెంకటరమణ శ్రీనివాస్ పలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు