పీఆర్టీయూ టీఎస్ మండల శాఖ సభ్యత్వ నమోదు 

PRTU TS Mandal Branch Membership Registrationనవతెలంగాణ – గోవిందరావుపేట 
పి ఆర్ టి యు టి ఎస్ మండల శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం ముంబరంగ నిర్వహించినట్లు ములుగు జిల్లా గౌరవ అధ్యక్షులు దేవులపల్లి సత్యనారాయణ అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్దేశించి సత్యనారాయణ మాట్లాడుతూ జడ్పీహెచ్ఎస్ దుంపెల్లి గూడెం పసర గోవిందరావుపేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం చల్వాయి మోడల్ పాఠశాలలో ముమ్మరంగా మెంబర్షిప్ క్యాంపియన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. మండల శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు కాసర్ల రమేష్, ప్రధానకార్యదర్శి వెం యాకూబ్ రెడ్డి, మండల అధ్యక్షులు కణతల నాగేశ్వరావు, ప్రధానకార్యదర్శి పాడియా తులసీ రామ్ సీనియర్ కార్యకర్తలు మలోత్ ఈరు , రాజమౌళి, జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ,ప్రధానోపాధ్యాయులు కాటం మల్లారెడ్డి, శ్రీనివాస్ , తిరుపతయ్య, నిజమోద్దీన్ పాల్గొన్నారు.