– జిల్లా పిఆర్టీయూ అధ్యక్షుడు ఆకుల మాణయ్య
నవతెలంగాణ – జోగిపేట
ఉపాద్యాయుల సమస్యల పరిష్కారం దిశగా పిఆర్టియు నిరంతరం కృషి చేస్తుందని పిఆర్టీయూ జిల్లా అద్యక్షుడు ఆకుల మాణయ్య అన్నారు. శుక్రవారం జోగిపేట లో ఏర్పాటుచేసిన మండల, పట్టణ పిఆర్టీయూ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో అపస్తృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లి వాటికి పరిష్కార మార్గాలు చూపిస్తున్న సంఘం పిఆర్టియు ఏకైక సంఘం అన్నారు. పెండింగ్లో ఉన్న డీఏ, పిఆర్సీ ఇప్పంచేందుకు ప్రభుత్వంతో సంఘం చర్చలు జరుపుతున్నామని అన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించేందుకు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అనంతరం పిఆర్టియు పట్టణ అధ్యక్షులుగా, గ్రామీణ అధ్యక్షులుగా ఎస్ నరోత్తం కుమార్, బి రాజమల్లుతోపాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు.
ఫోటో రైట్ అప్ జె పి టి-4, సమావేశంలో మాట్లాడుతున్న పిఆర్టియు జిల్లా అధ్యక్షులు మానయ్య