నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, క్రీడా పాఠశాలలకు 2024-25 విద్యాసంవత్సరం కంటింజెనీ నిధుల విడుదలపై పీఆర్టీయూటీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ బిల్లులకు సంబంధించి కంటింజెన్సీ నిధుల నుంచి కాకుండా ప్రభుత్వమే చెల్లించేందుకు ఉత్తర్వులిచ్చి పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నియమించి వారి వేతనాల కోసం ప్రత్యేక గ్రాంటు కూడా విడుదల చేసి, బడుల మౌలిక సదుపాయాల కోసం నిధులను నేరుగా ప్రధానోపాధ్యాయుల ఖాతాలో జమచేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.