నవతెలంగాణ-జోగిపేట
పీవైఆర్ ఫౌండేషన్ పేదలకు అండగా నిలుస్తూ.. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆ ఫౌండేషన్ చైర్మెన్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి తెలిపారు. జోగిపేట వాసవి కళ్యాణ మండపంలో పీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడు తూ.. తమ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నా మన్నారు. తాను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చానని.. అంచలంచలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నట్టు గుర్తు చేశారు. నరేంద్ర మోడీ మన దేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారన్నారు. తాను ఇప్పటివరకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చానని.. జహీరాబాద్ పార్లమెంటు నుంచి తనకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. అనంతరం ముగ్గు ల పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులు ప్రధానం చేశారు. మొదటి బహుమతిగా ఈ. స్వప్నకు రూ.15000, ద్వితీయ బహుమతిగా యన్. యాదలక్ష్మికి రూ. 10,000, తతీయ బహుమతిగా చిట్యాల మానస రూ.5000లను చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్య కమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్.ప్రభాకర్ గౌడ్, జిల్లా నాయకులు జే. ప్రభాత్, నాయకులు శ్యామా గౌడ్, నర్సింలు, మహేందర్, శివచందర్, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్య క్షురాలు గోలి పద్మ ప్రధాన కార్యదర్శి గజవాడ మంజుల, సహాయ కార్యదర్శి కాసాల నాగమణి, ఉపాధ్యాయులు శ్రీ లత, సుగుణ లు పాల్గొన్నారు.