పాలిచ్చే తల్లులు ఒత్తిడికి గురైతే మనోవ్యాధులు: డా.హిప్నో పద్మా కమలాకర్

నవతెలంగాణ-హైదరాబాద్: ఆగస్టు 1వ తేదీ నుంచి 7వతేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. తల్లిపాల ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా ఆగస్టు మొదటి వారంరోజుల పాటు ఈ వారోత్సవాలను నిర్వహిస్తారు. అమ్మపాలు బిడ్డకు ఎంతరక్షో.. పాలిచ్చే తల్లికి కూడా అంతే రక్ష..సృష్టిలో ప్రతిప్రాణికీ జన్మతోనే కొన్ని అమూల్య సంపదలోస్తాయి. వాటిలో ముఖ్యమైనవి అమ్మ పాలు. అలాగే ఆరోగ్యవంతమైన దేహం ఒక సంపద. పచ్చని పసిడి వెలుగులో పారిజాతాల్లా కురిసే అమృత జల్లుల్ని ఎందరు ఆలింగనం చేసుకుంటున్నారు..? అందువల్లే, ఆనందం అందని అనుభూతిగా మిగిలిపోతోంది.మనం వెతుక్కునే చోట ఆనందం కనిపించదు. ఆనందం ఉన్నచోట్లను మనం గుర్తించలేకపోతున్నాం. తల్లి ప్రేమలో, తండ్రి ఆలింగనంలో, బిడ్డ నవ్వులో, స్వార్థంలేని మనిషిల్లో మాధుర్యం లాంటి ఆనందం దాగి ఉంది. అమ్మపాలు బిడ్డకు ఓ వరం, అత్యంత సురక్షితం.బిడ్డకు తల్లిపాలకు మించి పౌష్టికాహారం ప్రపంచంలో మరొకటి లేదు. అమ్మపాలు అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారు. అంతేకాదు అనేకరకాల వ్యాధుల్ని జయించ గలుగుతారు. అమ్మపాలు తాగే శిశువులు సంపూర్ణ ఆరోగ్యంతోపాటు, వజ్ర సమానమైన రోగనిరోధక శక్తిని పొందుతారు. అమ్మపాలతో తల్లికి, బిడ్డకు ఇద్దరికీ అనేక ప్రయోజనాలున్నాయి.తల్లిపాలతో బిడ్డకు మానసిక ఆరోగ్యం..తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి. అంతేకాదు వీటిలో ఉండే నాణ్యమైన ప్రోటీన్లు, బిడ్డ మెదడు వికాసానికి తోడ్పడుతాయి. అమ్మపాలు తాగినవారిలో బాల్యంలోనూ ,యవ్వనంలోనూ ఊబకాయం వచ్చే ప్రమాదం చాలా తక్కువ.పిల్లల మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కనిపిస్తుంది.బిడ్డ పాలు తాగడం వల్ల తల్లికి ఒత్తిడి స్థాయిలు తగ్గి మానసిక స్థితి మెరుగవుతుంది. మొదటి సారి డెలివరీ తర్వాత 1000 మంది లో ఒకరికి పోస్ట్ పార్టం బ్లూస్ డిప్రెషన్ వస్తుంది. చిన్నప్పటివికాని, భర్త అత్తమామలు నుంచి వచ్చే సమస్యలతో డిప్రెషన్ మూడ్ లో ఉంటారు.ప్రెగ్నెన్సీ లో కొంత శాతం మెదడు బరువు తగ్గుతుందనిపలు అధ్యయనాల్లో వెల్లడిస్తున్నాయి. దాని వల్ల హార్మోన్ల ఇన్ బాలెన్స్ జరిగి ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.పాలు ఎలా ఇవ్వాలో తెలియకపోవడం వల్ల ఒత్తిడి పెరగడం జరుగు తుంది. జ్ఞాపకశక్తి తగ్గి, ఏకాగ్రత లోపిస్తుంది. ఈ సమయంలో తల్లి స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండాలి.స్ట్రెస్ ఫ్రీ ఉండే లా చూడాల్సిన బాధ్యత తల్లి దండ్రులు, అత్తమామలు, భర్తకు ఎంతైనా ఉంది. కొడుకు బిడ్డను ఒకలా, కూతురు బిడ్డను మరొకలా చూడడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. అందుకే తల్లిగారి ఇంట్లో కాని, భర్త సహకారం ఉంటే ఆనందంగా ఉండగలరు.తల్లి-పిల్లల బంధం..తల్లి పాలివ్వడం ద్వారా పిల్లల్లో సామాజిక సంబంధాలు పెరుగుతాయి. ఆ రిలేషన్స్ ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యాక అభివృద్ధితో ముడిపడి ఉంటాయి. తల్లిపాలు శిశువులో ప్రశాంత మైన ప్రభావాలను ప్రేరేపిస్తాయి.పలురుగ్మతలను తగ్గిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. శిశువులలో సంఘవిద్రోహ ధోరణులను లేకుండా చేస్తుంది.తల్లి బిడ్డల మధ్య సామాజిక బంధం పెరుగుతుంది. తల్లి పిల్లల భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యాలను పెంచుతుంది. తల్లి-పిల్లల బంధాన్ని మెరుగుపరుస్తుంది.తల్లి స్పర్శ శిశువుకు వెచ్చదనం ఇవ్వడమేకాకుండా, సున్నితత్వాన్ని ఇస్తుంది. తద్వారా శిశువునకు ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపడుతుంది.చిన్నారులకు పాలివ్వడం వల్ల తల్లులు మరింత చురుకుగా ఉండగలుగుతారు. తమ బిడ్డకు పాలివ్వడం ప్రయోజనకరమని తెలుసుకున్న తల్లుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.సాధారణంగా తమ శిశువును ఎక్కువగా స్పర్శిస్తూ ఉంటే తల్లీ,బిడ్డల మధ్య బంధం దృఢంగా ఉంటుంది.డెలివరీ తర్వాత డిప్రెషన్..స్త్రీ గర్భధారణ సమయంలో లేదా ఆమెకు బిడ్డ పుట్టిన తర్వాత మానసిక ఆరోగ్య పరిస్థితిలో కొన్ని మార్పులొస్తాయి. దాదాపు 13 నుంచి 19 శాతం మంది మహిళలు దీని బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.అణగారిన, నిస్సహయ స్థితి లేదా పనికిరానివారు అని అనుకుంటారు. ఈ పరిస్థితితో బాధపడేవారికి ఇది కష్టంగా వుంటుంది. ప్రసవానంతర డిప్రెషన్ స్వల్పకాలికంగా ఉండవచ్చు కానీ తల్లికి జన్మనిచ్చిన తర్వాత కూడా ఇది రెండు సంవత్సరాల వరకు కొంతమంది లో ఉంటుంది.ప్రసవానంతర తల్లులకు అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ ,లేదా ఆందోళన వంటి మరిన్ని మానసిక సమస్యలు నెలకొంటాయి.అపరాధం, అవమానం, లేదా నిరుత్సాహం. పాలు పట్టలేని తల్లులు తమకు అవసరమైన వాటిని పిల్లలకు అందించలేననే అపరాధం, అవమానం, నిరాశతో ఉంటారు. ఇది ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలకు దారితీయవచ్చు. తల్లిపాలు ఇవ్వలేకపోవడంతో అసంతృప్తితో ఉంటారు.ఈ సమయంలో పాలు ఇవ్వకపోవడం మంచిది.తల్లి పాలు తాగని పిల్లలు….రకరకాల కారణాలతో తల్లిపాలు శిశువులకు అందకపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గి పలు వ్యాధులకు గురవడం, సరైన ఎదుగుదల లేకపోవడం, ఐక్యూ స్థాయి పడిపోవడం లాంటి తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. అధిక స్థాయిలో దూకుడు స్వభావం, సంఘవిద్రోహ ప్రవర్తన పెంచడానికి దోహదం చేస్తుంది. తల్లులు శిశువులు ఒకరినొకరు చూసుకుంటూ ఎక్కువ సమయం గడుపుతారు. తల్లులు తమ శిశువు అవసరాలకు ఎక్కువ ప్రతిస్పందిస్తారు, సున్నితంగా ఉంటారు. తల్లులు తమ బిడ్డపై ఎక్కువ సమయం, అతి శ్రద్ధపెడతారు. దాని వల్ల పిల్లల్లో ఆందోళన, కంగారు, ఇన్ ఫిరియార్టి కాంప్లెక్స్ వంటి సమస్యలు వస్తాయి.పాలిచ్చే తల్లులు ఒత్తిడికి గురైతే హార్మోన్లు అధిక స్థాయిలో ఉత్పత్తి అయ్యి బిడ్డలోకి ప్రవేశించి మనోవ్యాధులకు గురవుతారు.టెన్షన్ పడుతూ, సందేహిస్తూ పాపాయికి పాలివ్వడం మంచిది కాదు. తల్లిపాలు తల్లి, బిడ్డల మధ్య బంధాన్ని పెంచుతాయి. ఇది మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని సులభతరం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆలోచనలతో ప్రశాంతంగా పాలు ఇస్తే, పిల్లలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడానికి వీలవుతుంది.డిప్రెషన్ ఉన్న తల్లి కి మానసిక సామాజిక మద్దతును అందించాలి . ఇందులో ఆహారం, ఇంటి పనులు, తల్లి సంరక్షణ, సాంగత్యం వంటివి. చికిత్సలో కౌన్సెలింగ్ లేదా మందులు ఉండవచ్చు . ఇంటర్ పర్సనల్ సైకోథెరపీ (×ూు), కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (జదీు) సైకోడైనమిక్ థెరపీ వంటివి ఇస్తే సమస్యనుంచి త్వరగా కోలుకుంటారు.