– రూ.3 లక్షలు సేకరణొ శంకర్ ఫౌండేషన్‌కు విరాళం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌లోని పీ అండ్ జీ ఇండియా గ్రూప్ ఉద్యోగులు స్పోర్ట్స్ మారథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.3 లక్షల విరాళాలు సేకరించి, వికలాంగ పిల్లలకు చేయూతనిచ్చే శంకర్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. పీ అండ్ జీ ఇండియా కంపెనీ టైడ్, ఏరియల్ వంటి బ్రాండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఆ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 300 మంది ఉద్యోగులు ఈ మారథాన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్లాంట్ హెడ్ సుమిత్‌రాణా మాట్లాడుతూ ఉద్యోగుల మానవతా సహాయాన్ని ప్రసంసించారు. ఉద్యోగుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించేందుకు కంపెనీ స్పోర్ట్స్ ఫెస్ట్‌లో భాగంగా మారథాన్ నిర్వహించామన్నారు. అలాగే క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, బ్యాట్మింటన్, వాలీబాల్, క్రికెట్ వంటి క్రీడలు కూడా నిర్వహించామన్నారు. తమసంస్థ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల మన్ననలు పొందాయనీ, విశేష ఆదరణ సంస్థను ఆగ్రస్థానంలో నిలుపుతున్నదని తెలిపారు.