– మేజర్ గ్రామపంచాయతీలో డే అండ్ నైట్ షిఫ్ట్ ఏర్పాటు చేయాలి అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
హాలిడేస్ కంటే ముందే ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా ఎంపీడీవో ను ఆదేశించారు. జక్రాన్ పల్లి మండలం లొ గత నెల 28 నుండి ఈ నెల 6 వరకు కొనసాగిన ప్రజాపాలనకు సంబంధించిన 14,629 దరఖాస్తులను ఆన్లైన్లో ప్రక్రియ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లు దరఖాస్తులను ఆన్లైన్లో చేసే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. సోమవారం జక్రాన్పల్లి మండలం ప్రజా పాలన అప్లికేషన్ లను డాటా ఎంట్రీ రిపోర్ట్ ప్రోగ్రెస్ పెరగనందున అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా మంగళవారం మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో ప్రజా పాలన దరఖాస్తుల ఎంట్రీని కలెక్టర్ చిత్ర మీశ్రా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాలిడేస్ కంటే ముందే ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ ఎంట్రీ పూర్తి చేయాలని, మేజర్ గ్రామపంచాయతీలో డే అండ్ నైట్ షిఫ్టులు ఏర్పాటు చేసి ప్రణాళిక ప్రకారం డాటా ఎంట్రీని పూర్తిచేయాలని మండల స్థాయి అధికారులు ఆదేశించారు. కార్యక్రమం లో మండల ఎంపీడీఓ భ్రమ్మనంధం, ఎంపీ ఓ యూసఫ్ ఖాన్, తాసిల్దార్ ఎం.ఏ ఖలీమ్ స్పెషల్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్, తదితరులు ఉన్నారు.