
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఇసుక వేస్తే రాలని చందంగా లబ్ధిదారులు కిక్కిరిసి పోతున్నారు.ఉదయం నుండి సాయంత్రం వరకు కార్యాలయం సందడి సందడిగా తయారైంది.మండలంలో 16 వేల మంది గృహ వినియోగ దారులు ఉన్నారు. గృహ జ్యోతి పధకానికి ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకున్నారు.కానీ మండలం 8 వేలమంది కి మాత్రమే ఈ పధకం లబ్ధిదారులు గా ఎంపిక అయ్యారు.అయితే 200 యూనిట్ లు వచ్చినా కొందరు గృహ జ్యోతికి అర్హత పొందలేదు.దీంతో ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చి ప్రజాపాలన సేవా కేంద్రం పేరుతో తిరిగి దరఖాస్తులు స్వీకరిస్తుంది.ఈ క్రమంలో వైట్ రేషన్ కార్డు లేనివారు,గతంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులో పూరి వివరాలు నమోదు చేయని వారు తిరిగి దరఖాస్తులు పెడుతున్నారు. గురువారం నాటికి 1800 దరఖాస్తులు వచ్చినట్లు ఎల్.డి.సి కుమారి తెలిపారు.
ముడు కౌంటర్ లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అని మరో ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్ లు తో వచ్చిన దరఖాస్తులు నమోదు చేసి,పాత దరఖాస్తులను సరి చూస్తున్నాం అని ఎం.పి.డీ.ఒ శ్రీనివాస్ తెలిపారు.