బేగంపేట్ పన్నూర్  గ్రామాలలో ప్రజాపరిపాలన కార్యక్రమం

– ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ 
– బేగంపేటలో 973 పన్నూరులో 625 దరఖాస్తులు 
నవతెలంగాణ-రామగిరి
పెద్దపల్లి జిల్లా  రామగిరి మండలంలోని  బేగంపేట్ పన్నూర్ గ్రామాలలో ప్రజా పరిపాలనలో భాగంగా గ్రామంలో ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. మండల ఎంపీఓ మాట్లాడుతూ, బేగంపేటలో 973 పన్నూరులో 625 దరఖాస్తులు స్వీకరించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజా పరిపాలన ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. మంథని శాసనసభ్యులు ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు 6 గ్యారంటీలు పేదల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఆయన  ఆశయమని అని అన్నారు. అదేవిధంగా  ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అభయ హస్తం పథకం కింద  గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి, గృహలక్ష్మి,గృహజ్యోతి, చేయూత సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని, ఆమె సూచించారు. ఈకార్యక్రమంలో  రామగిరి మండల తహసీల్దార్ రాంచందర్ రావు, ఎంపీడీఓ ఇనుముల రమేష్,బేగంపేట్ పన్నూర్ సర్పంచులు, బుర్ర పద్మ శంకర్ గౌడ్ అల్లం పద్మ తిరుపతి,ఎంపీటీసీ లు మారగోని కరుణ కుమారస్వామి, చిందం మహేష్,  మిషన్ భగీరథ ఏఈ, స్పెషల్ ఆఫీసర్ , డిప్యూటీ తాహసిల్దార్ రాకేష్,ఎంపిఓ  కాటం భాస్కర్, వైస్ ఎంపీపీ శ్రీదేవి, ఎంపీఎం స్వరూప రాణి, సూపర్వైజర్ రజిత,ఉప సర్పంచులు తదితరులు  పాల్గొన్నారు.