చిన్న తడుగూరులో తాసిల్దార్ ఆవల్గావ్ లో ఎంపీడీవో ప్రారంభించిన ప్రజాపాలన

నవతెలంగాణ మద్నూర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన సదస్సులో భాగంగా చివరి రోజు శనివారం నాడు మద్నూర్ మండలంలోని చిన్న తడగూర్ గ్రామంలో మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ మండలంలోని అవల్గావ్ గ్రామంలో ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్ ప్రజా పాలన సదస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజలకు అధికారులు సలహాలు సూచనలు అందించారు ఇరు గ్రామాల్లో మండల అధికారులు ప్రజల నుండి ప్రజా పాలన దరఖాస్తులను సేకరించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు వివిధ శాఖల అధికారులు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.