ఈనెల 11న ద్విచక్ర వాహనాలకు బహిరంగ వేలం 

నవతెలంగాణ కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్, ఎక్సైజ్ నిజామాబాద్ ఆదేశాల మేరకు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి చంద్రభాన్ నాయక్ సమక్షంలో డిసెంబర్ 11వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దిలీప్ శనివారం ప్రకటనలో తెలిపారు. వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలు కు బహిరంగ వేలం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ నిజామాబాద్, ( బోర్గాం పి)లో ఉంటుందని తెలిపారు. కావున ఆసక్తి గల వారు ఈ ఎండి చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనాలని కోరారు. వాహనాల వివరాల్లో కావలసినవారు బొర్గాం లోని ఎక్సైజ్ కార్యాలయంలో సందర్శించి తెలుసుకోవాలన్నారు.