ఈవీఎం, వీవీ ప్యాట్ వినియోగంపై ప్రజలకు అవగాహన..

– గోషామహల్ సర్కిల్ -14 డిప్యూటీ కమిషనర్ డి బాలయ్య

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
 వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) వీవీప్యాట్ లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అబిడ్స్ సర్కిల్ కార్యాలయంలో ఈవీఎం మిషన్ ఏర్పాటు చేశామని జిహెచ్ఎంసి గోషామహల్ సర్కిల్ -14 డిప్యూటీ కమిషనర్ డి బాలయ్య తెలిపారు. శనివారం అబిడ్స్ లోని జిహెచ్ఎంసి సర్కిల్ -14 కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈవీఎం, వీవీప్యాట్ లపై ప్రజలకు. వివిధ రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించేందుకు సర్కిల్ కార్యాలయంలో మిషన్ ను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం మన హక్కు అని చెప్పారు. ఈ వీఎం యంత్రాలు, వీవీ ప్యాట్ ద్వారా ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలకు అపోహలు‌. సందేహాలు నివృత్తి చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. సోమవారం వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. వర్షాలు కురుస్తున్న కారణంగా గోషామల్ సర్కిల్ పరిధి లోనీ ప్రజల కు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వారికి సహాయం అందించేందుకు  24 గంటల పాటు మన్ సున్ ఎమర్జెన్సీ టీం. డి ఆర్ఎఫ్ బృందాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.