– అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు
– ప్రజావాణి లో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్
నవతెలంగాణ – సిరిసిల్ల
ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సోమవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి కు వచ్చే దరఖాస్తులు పెండింగ్ లో పెట్టవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారని తెలిపారు. ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తులు. రెవెన్యూ శాఖకు 52, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 11, డీపీఓకు 4, ఉపాధి కల్పన కార్యాలయానికి, డీపీఆర్ఈ, ఎస్డీసీ, జిల్లా సంక్షేమ శాఖ కు మూడు చొప్పున, తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయానికి, ఆర్ అండ్ బీ, వ్యవసాయ శాఖకు, ఎక్సైజ్ శాఖకు, పౌర సరఫరాల శాఖ కు, విద్యాశాఖకు రెండు చొప్పున, వేములవాడ, గంభీరావుపేట, చందుర్తి, బోయినపల్లి ఎంపీడీవో కార్యాలయాలకు, ఎస్సీ అభివృద్ధి శాఖకు, సర్వే, డీసీఓ బీసీ, ఎస్పీ కార్యాలయం, డీఎంహెచ్ఓ, జడ్పీ సీఈవో కార్యాలయాలకు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 101 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.