– రేషన్ షాపుల్లో 14 రకాల సరుకులను ఇవ్వాలి
– ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత
నవతెలంగాణ-వైరాటౌన్
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను దృష్టిలో వుంచుకొని ప్రభుత్వం రేషన్ షాపుల్లో 14 రకాల సరుకులను ఇవ్వాలని ఐద్వా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత డిమాండ్ చేశారు. బుధవారం ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం, హనుమాన్ బజార్, బీసీ కాలనీ నందు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా గుడిమెట్ల రజిత మాట్లాడుతూ చాలి చాలని వేతనాలు, పెరిగిన ధరలు వలన పేద, సామాన్య మధ్య తరగతి ప్రజలు కనీసం రెండు పూటలు తినలేని పరిస్థితిలో ఉన్నారని, మహిళలు పౌష్ఠికాహారం లోపం, రక్త హీనతతో బాధపడుతూ అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికీ 10 కేజీల సన్న బియ్యం, మంచి నూనె, గోధుమలు, పంచదార, చింతపండు, కందిపప్పు, కారం, పసుపు ఉప్పు తదితర 14 రకాల నిత్యావసర వస్తువులను ఇవ్వాలని, ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు బందేల అమతమ్మ, బత్తుల ప్రమీల, మేక శైలజ, వేముల స్వప్నా, వేముల భారతి, కురివేళ్ళ సంధ్యారాణి, యామాల రాణి, తురక రాములమ్మ, గుంజి అనిత, ఓర్పు సరిత, ఓర్పు రాధమ్మ, బత్తుల అనిత, బత్తుల దుర్గా, దేవుళ్ళ సరిత తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాల ప్రజావ్యతిరేక
విధానాలను నిరసిస్తూ ఆందోళన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, గ్యాస్, పెట్రోల్, డీజిల్, మందులు, నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం పెంచడానికి నిరసనగా సీపీఐ(ఎం) వైరా శాఖ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ బజార్, బీసీ కాలనీ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సభ్యురాలు గుడిమెట్ల రజిత మాట్లాడుతూ బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు నిరంతరం ధరలు పెంచుతూ ప్రజలపై అధిక భారాలు వేస్తున్నాయని విమర్శించారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, మందులు, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) వైరా పట్టణ నాయకులు గుడిమెట్ల మెహనరావు, వైరా శాఖా కార్యదర్శి ఓర్సు సీతారాములు, శాఖా సభ్యులు దేవుళ్ళ కష్ణ, బత్తుల ప్రమీల, దేవుళ్ళ మంగ, ఉప్పు వేణు, వేముల భూలక్ష్మీ, వేముల గోపి, వేముల బాలస్వామి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.