
నేడు మండల కేంద్రం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయములో ఉపాధి హామీ పనుల పై తనిఖీ ప్రజా వేదిక నిర్వహించడం జరుగుతుందని ఇంచార్జి ఎంపీడీఓ మహమ్మద్ హఫీజ్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకములో 13 వ, విడత సామాజిక తనిఖీ నేడు ప్రజా వేదిక కు హాజరు ఉపాధి సిబ్బంది అందరూ హాజరు కావాలని తెలిపారు. మండలములోని 26 గ్రామాలకు సంబందించి రికార్డుల 01/04/2023 నుండి 31/03/2024 వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ బృందము పరిశీలన చేస్తున్నారని అన్నారు. మండలములో చేపట్టిన పనులు, వేతన చెల్లింపుల పై నేడు10 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయములో ప్రజా వేదిక (ఓపెన్ ఫోరం) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.