బషీరాబాద్ లో ప్రజా పాలన గ్రామసభ


నవతెలంగాణ కమ్మర్ పల్లి: మండలంలోని బషీరాబాద్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ సక్కారం అశోక్ ఆధ్వర్యంలో ప్రజాపాలన గ్రామసభను నిర్వహించారు. గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపటినటువంటి ఆరు గ్యారెంటీలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారంటీ అమలులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ రెడ్డి, మండల స్పెషల్ ఆపిసర్ యోహాన్, ఎంఇఓ ఆంద్రయ్య, మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షకులు మైలారం గంగాధర్, మండలస్థాయి అధికారులు, డిప్యూటీ తహసిల్దార్ భాస్కర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఏఎన్ఎంలు విజయ, రూప, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, లబ్దిదారులు, మహిళలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.