నవతెలంగాణ – భువనగిరి రూరల్
భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో శనివారం ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒకరికి అందించాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకువచ్చింది అన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడమంచి ప్రభాకర్, ఎంపీటీసీ మట్ట పారిజాత శంకర్ బాబు గౌడ్, వార్డు సభ్యులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.