ప్రజా పాలన గ్రామసభల్లో రసాభాస..

Public governance in the village councils.– ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేర్లు లేవని ప్రజల నిలదీత..
నవతెలంగాణ – జన్నారం  
రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న  పథకాలను అర్హులందరికీ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని స్థానిక తాహసిల్దార్ రాజమనోహర్ రెడ్డి, ఎంపీడీఓ శశికళ, మండల పశువైద్యాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్, ఎంపీ ఈవో జలంధర్ డిప్యూటీ తాసిల్దార్ రామ్మోహన్ రావు, అన్నారు. బుధవారం   మండలంలోని  పొనకల్ జన్నారం ధర్మారం  రేండ్లగూడ కిష్టాపూర్ ఇంజన్ పళ్లి గ్రామాలలో ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహించారు. సందర్భంగా రేండ్లగూడ గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రజా పాలనలో రసాభాసగా మారింది. ఆ గ్రామస్తులు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులలో తమ పేర్లు లేవని అధికారులను నిలదీశారు. గ్రామంలో అర్హులు ఉన్నప్పటికీ వారికి రేషన్ కార్డులు అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ఇస్తున్నారని గ్రామస్తులు ఆందోళన దిగారు. దీంతో అధికారులు స్పందించి అర్హత ఉన్న వారందరికీ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు అందిస్తామని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. అధికారులు సర్ది చెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది. ఆయా గ్రామసభల్లో ఆ అధికార్లు మాట్లాడుతూ, ప్రభుత్వం సదుద్దేశంతో 4 కొత్త సంక్షేమ పథకాలను ఈ నెల 26 నుంచి అమలు చేయనుంద న్నారు. ఆ పథకాల ఎంపిక కొరకు గ్రామస భల్లో ప్రజల సమక్షంలో వివరాలు వెల్లడించి అభిప్రా యాలు సేకరించ నున్నట్లు వారు చెప్పారు. రేషన్  కార్డుల ఇందిరమ్మ ఇండ్ల, రైతు భరోసా, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికా వద్దన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల కార్యదర్శులు స్పెషల్ అధికారులు  వివిధ పార్టీల నాయకులు ప్రజలు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.