ప్రజా పాలన గ్రామ సభల్లో రసాభాస..

Rasabhasa in the village councils of public governance..–  కామన్ పల్లి గ్రామపంచాయతీలో ఒకరికి కూడా ఇందిరమ్మ ఇల్లు లేవు
– చింతగూడ తపాలపూర్ గ్రామాల్లో అధికారులను నిలదీసిన ప్రజలు
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన ప్రజా పాలన గ్రామసభల్లో వచ్చిన అధికారులను ప్రజలు నిలదీశారు. మండలంలోని కామన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నాయక గూడాలో 20 గిరిజన ఇండ్లు ఉండగా వారికి ఒకటి కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదని, ఒకరికి కూడా రేషన్ కార్డులో పేరు లేదని అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకంలో కూడా వారి పేరు జాబితాలో లేకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు.  కేవలం గ్రామాల్లో ఉన్న అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ లబ్ధిదారుల ఎంపిక సాగుతుందని ఇది సరైన పద్ధతి కాదని ఆ గ్రామస్తులు అధికారులను నిలదీశారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇస్తామని అధికారులు ప్రజలకు సూచించారు. కార్యదర్శికంగా ఈ గ్రామ సభలు కొనసాగుతున్నాయి అన్నారు. మండలంలోని రాంపూర్ తిమ్మాపూర్ తపాలాపూర్ దేవుని గుడా కొత్తపేట కామన్ పెళ్లి కవ్వాల్, కలమడుగు మురిమడుగు, హాస్టల్ తండా మొర్రిగూడ వెంకటాపూర్, లో తొర్రే, మల్యాల సింగరాయపెట్  ఇంధనా పల్లి మహ్మదాబాద్ రోటి గూడ టీజీ పల్లె తదితర గ్రామాల్లో ప్రజా పాలన గ్రామసభలు ముగిశాయి. ఈ గ్రామ సభలో రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు, పంట పండే లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు, ఆ జాబితాలో లేని వాళ్లు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయా గ్రామాలకు వెళ్లిన స్పెషల్ అధికారులు ప్రజలకు సూచించారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల్లో వెళ్లిన అధికారులు తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఎంపీడీవో శశికళ పిఓపిఆర్డి జలంధర్, డిప్యూటీ తాసిల్దార్  రామ్మోహన్ రావు, వ్యవసాయ శాఖ అధికారి సంగీత  ఆర్ఐ గంగరాజు, ఆయా గ్రామాల కార్యదర్శులు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.