ప్రజా ఆరోగ్యమే దేశ శ్రేయస్సు…

– కరీంనగర్ వాకర్స్ అసోసియేషన్
నవతెలంగాణ కరీంనగర్:ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమావేశం రెవెన్యూ గార్డెన్ డిస్టిక్ 33 ఏరియా కోఆర్డినేటర్ అన్నం నేనే సుధాకర్ రావు అధ్యక్షతన జరిగింది.  ఉమ్మడి జిల్లాలో వాకర్స్ అసోసియేషన్ లను బలోపేతం చేయడమే లక్ష్యంగా వాకర్స్ అసోసియేషన్లు కృషి చేయాలని, నడవండి నడిపించండి, మానవసేవే మాధవసేవ అనే నినాదంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాకర్స్ అసోసియేషన్ కృషి చేస్తుందని సుధాకర్ రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు డిస్టిక్303 ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ వరంగల్ జిల్లాతో కలిసి ఉందని,  కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 వాకర్ సంఘాలను ఏర్పాటు చేసుకొని డిస్టిక్ 304గా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఏర్పాటు చేసుకొని వాకర్ సంఘాలు కృషి చేయాలని తీర్మానిచామని ఆయన తెలిపారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని వాకర్ సంఘాలు తమ తమ సంఘాలలో హెల్త్ క్యాంపులు. రక్తదాన శిబిరాలు వికలాంగులకు అనాధలకు తగిన సహాయం చేయాలని నిర్ణయించుకోనైనది ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ఏరియా కోఆర్డినేటర్ అన్నం నేనే సుధాకర్ రావు, డిప్యూటీ గవర్నర్లు గొట్టుముక్కుల రవీందర్, గుడిపాటి రమణారెడ్డి, బూర జగదీశ్వర్ గౌడ్, గౌతమ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రఘునందన్ రాజ్, వాకర్స్ అసోసియేషన్ల అధ్యక్షులు కల్వకుంట్ల ప్రమోదరావు, కన్నం శ్రీనివాస్ వెంకట్ రెడ్డి, అనుమాండ్ల రఘుపతి రెడ్డి, సమ్మిరెడ్డి, కనుక చారి, లింగన్న, రాజేందర్, కోటేష్ ,మధుసూదనా చారి, కెముసారం తిరుపతి ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎర్ర నరసయ్య, పెంచాల కిషన్ రావు, చాడ రవీందర్ రెడ్డి, వల్లాల శ్రీనివాస్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, దాసరి అశోక్, కేసి మూర్తి ,తిరుపతి ,సుమన్, జిఎస్ ఆనంద్, వెంకటేష్ ,కిషోర్ గౌడ్, వాకర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు, కాశ్మీర్ గడ్డ వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు జావేద్ అలీ, నారాయణ, లక్ష్మీ రాజ్యం, సాగర్ శ్రీనివాస్, శశి కుమార్, ఇమామ్, లతో పాటు 100 మంది వాకర్స్ పాల్గొన్నారు.