ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి..

Public issues should be given high priority.– ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి..
– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండాగే…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ప్రజల సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే జెండగే జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి 65 ఫిర్యాదులను స్వీకరించారు.  రెవిన్యూ శాఖ 50, ఎస్.సి.సంక్షేమ శాఖ 2, మహిళా శిశు సంక్షేమ శాఖ 3, వ్యవసాయ శాఖ 2, జిల్లా పరిషత్, పరిశ్రమల శాఖ, ఉపాధి కల్పన శాఖ, సర్వే ల్యాండ్ రికార్డు శాఖ, భువనగిరి మున్సిపాలిటీ, పౌర సరఫరాలు శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ, గృహ నిర్మాణం శాఖ ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ కార్యక్రమంలో  జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి బెన్ షాలోమ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె గంగాధర్, జిల్లా పరిషత్ సిఇఓ శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు జయశ్రీ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పార్టసింహ్మారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.