ప్రజా సమస్యలను పరిష్కరించాలి

– కార్పొరేటర్‌ తలారి చంద్రశేఖర్‌
– బండ్లగూడ కమిషనర్‌ కు వినతి
నవతెలంగాణ-గండిపేట్‌
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలని కార్పొరేటర్‌ తలారి చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి వార్డులో తిరుమల హిల్స్‌ నుండి యాదయ్య నగర్‌ ఇండస్‌ వ్యాల్యూ హిమగిరి నగర్‌ ఇండిస్టీ వరకు రోడ్డు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దాంతోపాటు వీధి దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. కరెంటు స్తంభాలు, సీసీ రోడ్డు లేకపోవడంతో వీధి దీపాలు వెలిగించలేకపోతున్నట్టు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసేందుకు కషి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ ప్రశాంత్‌ నాయక్‌, బిల్‌ కలెక్టర్‌ కష్ణయ్య యాదవ్‌ తదితరులు కమిషనర్‌ కు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.