ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

బీజేపీ నేత గజ్జల నేత యోగానంద్‌
59వ రోజుకు చేరిన ప్రజా సమస్యలపై పాదయాత్ర
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగపల్లి డివిజన్‌లోని ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఆ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని శేరిలింగంపల్లి కాంటెస్టెడ్‌ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్‌ అన్నారు. డివిజన్‌లో చేపట్టిన ప్రజా సమస్యలపై పాదయాత్ర సోమవారం 59వ రోజుకు చేరింది. శేరిలింగంపల్లి డివిజన్‌ గోపినగర్‌, బాపునగర్‌ల్లో డివిజన్‌ అధ్యక్షులు రాజు శెట్టి కురుమ, గోపినగర్‌ బూత్‌ అధ్యక్షులు ఎ. మహేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర చేప ట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాడితే నీళ్లు,నిధులు, నియమకాలు పుష్కలంగా ఆశ పడిన ప్రజలందరికీ నిరాశే మిగిలిందన్నారు. అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తామని హామీనిచ్చి, ఇప్పుడెమో వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. స్థానిక గోపినగర్‌ కాలనీలో నెలకొన్న సమ్యలు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదాన్నరు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తానన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్‌ ప్రధాన కార్యదర్శి సత్య కురుమ, ఉపాధ్యక్షులు సీహెచ్‌ బాలరాజ్‌, మియా పూర్‌ డివిజన్‌ ఉపాధ్యక్షులు రత్న కుమార్‌, బీజేవైఎం అధ్యక్షులు సిద్దు, ఎస్సీ మోర్చ అధ్యక్షులు భాషా శివ, సీనియర్‌ నాయకులు మీన షిండే, ఆశ్వినినాధ్‌, భార్గవ్‌ రామ్‌, వి. రమేష్‌, కల్పనాదేవి, ఎస్‌.జ్యోతి, ఫిరోజ్‌, ఎ. కల్యాణ్‌, ఎం. మహేష్‌ యాదవ్‌, రాజు, అనిల్‌, శ్రీను,తరుణ్‌, కార్తిక్‌, రమేష్‌, స్థానికులు పాల్గొన్నారు.