
డిచ్ పల్లి మండలంలోని సాంపల్లి గ్రామానికి చెందిన మల్ల కేశవ్ అంతరెడ్డి రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్ గత కోంత కళంగా అనారోగ్యంత బాధపడుతు సోమవారం మృతి చెందారు. మంగళవారం గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు పలు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, పాల్గొని ఘనంగా నివాళు లర్పించి కుటుంబ సభ్యులకు ఓదార్చరు.సర్పంచ్ గా పోటి చేసిన సమయంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ లో క్రియా శిలపత్ర పోషించారు.మాజి మంత్రి మండవ వెంకటేశ్వరరావు కు నమ్మిన బంటు గా వ్యవహరిస్తుండే వారిని గ్రామస్తులు తెలిపారు. సర్పంచ్ గా ఉన్న సమయంలోనే రవిందర్ రెడ్డి అనారోగ్యం పాలయ్యారు.అందరితో కలిసి మిలిసి ఉండే రవిందర్ రెడ్డి మృతి తమను ఎంతగానో కలిచి వేసిందని పలువురు పేర్కొన్నారు.అయన మృతి తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డిచ్ పల్లి మాజి జడ్పీ టీసి కులచరి దినేష్ కూమార్, సర్పంచ్ లు సంఘం మండల అధ్యక్షులు అంతిరెడ్డి మోహన్ రెడ్డి, తోపాటు అంతక్రియల్లో గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బందువులు పాల్గొన్నారు.