ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు భువనగిరి మండలంలోని తొక్క పురం గ్రామానికి శనివారం వచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో మృగత్ పల్లె ప్రకృతి వనాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీల పెంపకం, రెవెన్యూ ప్లాంటేషన్ విధివిధానాలను పరిశీలించారు. వాటి నిర్వహణ, వనరుల లభ్యత, గ్రామపంచాయతీ సిబ్బంది పనుల నిర్వహణ విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక బృందాల ఆవశ్యకత నిర్వాహనను అడిగి తెలుసుకున్నారు. టీఎస్ఐఆర్డి జేడి అనిల్ కుమార్, జడ్పీ సీఈఓ ఎన్ శోభారాణి, డిఆర్డిఓ నాగిరెడ్డి, అడిషనల్ డిఆర్డిఓ సురేష్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ దినాకర్, సెర్పు సంస్థ ప్రతినిధులు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.