నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన ఇస్లావత్ రాజశేఖర్ గృహం శుక్రవారం రాత్రి విద్యుత్ షాట్ సర్క్యూట్తో దహనం కాగా శనివారం ఉదయం పలువురు ప్రజాప్రతినిధులు రాజశేఖర్ ను పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాద బాధితునికి ప్రభుత్వం పరంగా అందే పూర్తి సహాయాన్ని అందించడంలో తోడ్పాటు అందిస్తామని అన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ గృహం నిర్మించి ఇవ్వాలని అన్నారు. పరామర్శించిన వారిలో పసర సర్పంచ్ ముద్దబోయిన రాము, గాంధీనగర్ సర్పంచ్ భూక్యా సుక్యా, ఎంపీటీసీ లావుడియా రామచందర్ వార్డు సభ్యులు చెరుకుల సురేష్ ఉన్నారు.