– సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ అన్నారు.తంగళ్ళపల్లి మండలం నేరేళ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టేట్ ఫైనాన్స్ నిధుల నుండి టిఎస్ డబ్ల్యూఐడిఎస్సి ద్వారా రూ.11 లక్షల రూపాయలతోని మంజూరైన సైన్స్ ల్యాబ్ కు గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమిపూజా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…తల్లిదండ్రులు తప్పని సరిగా పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని కోరారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడం ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర సర్కార్ కృషి చేస్తుందన్నారు.పాఠశాలల్లో పనులతో పాటు, విద్యార్థులకు యూనిఫార్మ్స్ ను మహిళా సంఘాల ద్వారా కుట్టించే ఏర్పాటు ప్రభుత్వం చేసిందన్నారు.పాఠశాల పనులలో అందరినీ భాగస్వామ్యం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో బోధన జరుగుతున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని కోరారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖి చేశారు.ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిట్ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్,డైరెక్టర్లు ఎట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,గుగ్గిళ్ల రాములు, గ్రామ శాఖ అధ్యక్షులు కోల శంకర్,నాయకులు మల్లేశం, బైరినేని రాము,జనార్దన్ రెడ్డి,పసుల లక్ష్మణ్, పొన్నం అశోక్,స్కూల్ ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులుపాల్గొన్నారు.