
ప్రజావాణి ని కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి కార్తీక్ రెడ్డి అన్నారు. గురువారం పెద్దగూడెం జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో మాట్లాడారు. ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారెంటీల పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు లబ్ధిదారుల వివరాలను గ్రామసభల ద్వారా దరఖాస్తు రూపంలో స్వీకరించి లబ్ధి చేకూర్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ లో ప్రతి గురువారం ప్రజావాణి నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి కార్తీక్ రెడ్డి, శ్రీనివాస్,శ్రరణ్య, ఏఎన్ఎం ధనమ్మ, అంగన్వాడీ టీచర్ హేమలత, సుష్మ, సత్యం, గ్రామస్తులు పాల్గొన్నారు.