బహిరంగంగా తై బజార్ వేలం..

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పురపాలక సంఘంలో  తైబజార్ వసూలు చేయుట గురించి ఈనెల 28న  వేలంపాట నిర్వహించనున్నారు. 2024- 25 సంవత్సరమునకు గాను నవంబర్ 1 2024 నుండి 31 మార్చి 2025 వరకు దరఖాస్తు రుసుబుతోపాటు రూ.50,000 ధరావత్ సొమ్ము ను భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో 26న సాయంత్రం 5 గంటల లోపు సమర్పించవలెనని కోరారు. ఈనెల 28 ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో వేలంపాట నిర్వహించబడుతుందని మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. వివరాలకు 9441009662లో సంప్రదించాలని కోరారు.