విద్యుత్ సమస్యలపై ప్రజావాణి..

నవతెలంగాణ – రాయపర్తి
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాయపర్తి ఏఈ పెద్ది రవళి అన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి ఉంటుందని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజా వాణి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను దరఖాస్తుల ద్వారా ఇవ్వాలని చెప్పారు. వినియోగదారులు చేసే ఫిర్యాదులను సమీక్షించి సకాలంలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నేడు బక్రీద్ పండుగ ఉన్నప్పటికీ ప్రజావాణి నిర్వహించినట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ కీర్తన, లైన్ మెన్ బడితపురం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.