ప్రజా శ్రేయస్సే అతని లక్ష్యం

– వేంపాడు లో మహా అన్నదానం చేసిన బుసిరెడ్డి పౌండేషన్
– 6300 మందికి ఉచిత అన్నదానం
– పేదలకు అండగా బుసిరెడ్డి పౌండేషన్
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమానూరు మండలం వేంపాడ్ గ్రామం లో ఆదివారం శ్రీ హనుమాన్ సీతా లక్ష్మణ పరివార సమేత శ్రీ రఘురామ వారి నూతన దేవాలయం ప్రారంభోత్సవం సందర్భంగా 6300 మందికి మహా అన్నదానమును బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి నిర్వహించారు. ఈసందర్బంగా నూతన దేవాలయ బింబ,యంత్ర,ధ్వజ,శిఖర, నవగ్రహ,నాగదేవత ప్రతిష్ట మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించారు.పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈసందర్బంగా వేంపహాడ్ గ్రామ యువకులు,పెద్దలు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ అడగ్గానే బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి మహా అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. అనంతరం పాండు రంగారెడ్డి ని ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, వేంపాడ్ సర్పంచ్ స్వాతి అశోక్,మాజీ యంపిపి మాజీ తిరుమలనాధ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి,కలసాని చంద్రశేఖర్ యాదవ్,బుర్రి పరమేశ్,సుజిత్,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, గడ్డం సజ్జన్,వంగాల భాస్కర్ రెడ్డి, తేరా అఖిల్ రెడ్డి, గ్రామస్తులు,మాజీ యంపిటిసి,మాజీ సర్పంచ్ మరియు తదితరులు పాల్గొన్నారు.