ప్రజా సంక్షేమమే ప్రభుత్వ విప్ లక్ష్యం: ఎంపీపీ గాల్ రెడ్డి

నవతెలంగాణ-భిక్కనూర్
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ లక్ష్యమని ఎంపీపీ గాల్ రెడ్డి తెలిపారు. గత నెలలో మండలంలోని జంగంపల్లి గ్రామ పర్యటనలో భాగంగా ప్రజా ప్రతినిధులు, గ్రామస్తుల కోరిక మేరకు ఇచ్చిన మాట ప్రకారం సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం కొరకు ఏం డి ఎఫ్ నిధుల నుండి 5.75 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ప్రభుత్వ విప్ కు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, ఏఎంసీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, సర్పంచ్ నర్సింలు యాదవ్, వైస్ ఎంపీపీ యాదగిరి, డిసిసిబి డైరెక్టర్, సొసైటీ చైర్మన్ సిద్ధరాములు, ఎంపీటీసీ యశోద, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ భాస్కర్, సొసైటీ వైస్ చైర్మన్ వాసు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.