– అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
– మోసపూరిత హామీలను నమ్మకండి
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని చేసిన అభివద్ధిని చూసి తనను ఆశీర్వదించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వై.అంజయ్య యాదవ్ ప్రజలను కోరారు. శనివారం కేశంపేట మండలం కోనాయిపల్లి, సంతాపూర్, కొత్తపేట గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనలో రాష్ట్రం అభివద్ధి ఎలా ఉన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం ఎంత అభివద్ధి చెందిందో ప్రజలకు గుర్తించాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలతోపాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను రూపొందించారని వివరించారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వాల 50 ఏండ్ల పాలనలో రాష్ట్ర అభివద్ధి కుంటు పట్టిపోయిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం ఎంతో అభివద్ధి చెందిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే వ్యవసాయ, విద్య, ఆరోగ్యం అభివద్ధి చెందిందన్నారు. నియోజకవర్గంలోని మండలాలలో ఏ గ్రామానికి వెళ్లి చూసినా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివద్ధే దర్శనమిస్తుందన్నారు. మరోసారి తనను గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని ప్రజలను ఈసందర్భంగా కోరారు. కార్యక్రమంలో సర్పంచులు నవీన్ కుమార్, వెంకట్ రెడ్డి,మల్లేష్ ఎంపీటీసీలు మల్లేష్ యాదవ్, రాజు, నాయకులు మురళీధర్ రెడ్డి జమాల్ ఖాన్, జగదీశ్వర్ గౌడ్, నారాయణరెడ్డి, నర్సింగ్ రావు, వెంకన్న యాదవ్, యాదగిరిరావు, పర్వత్‌రెడ్డి, వెంకటేష్ ముదిరాజ్, వెంకటయ్య, వేణుగోపాల చారి, నరేష్ యాదవ్, గణేష్ గౌడ్, జగన్ రెడ్డి, యాదయ్య గౌడ్, కుమార్ గౌడ్, సాజిద్, యాలాల యాదయ్య,అశోక్, నారాయణరెడ్డి, ప్రేమ్ కుమార్ గౌడ్, లక్ష్మీనారాయణ,చంద్రశేఖర్ శేఖర్, శేఖర్ పంతులు, రాజకుమార్, శశి నేత, రజనీకాంత్ గౌడ్, లక్ష్మయ్య, కష్ణ, ప్రభాకర్ రెడ్డి, యాదగిరి, యాదయ్య, పాల్గొన్నారు.