నవతెలంగాణ-బొమ్మలరామారం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని సింగిల్ విండో చైర్మన్ గుదే బాల్ నరసయ్య అన్నారు.మండల కేంద్రంలో శనివారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టును ప్రజలకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గంలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని మూడోసారి గెలిపించాలని కోరారు.అందరికీ సంక్షేమ పథకాలు అందేలా కషి చేశామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి మాయమాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుశంగుల సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కుదూగు ఉపేందర్, ఉప సర్పంచ్ జూపల్లి భరత్, సెక్రెటరీ గుర్రాల లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ మైలారం రామకష్ణ,కుక్కుదూగు గణేష్, బండి మహేష్ గౌడ్,కట్ట శ్రీకాంత్ గౌడ్, బోనకుర మల్లేష్, శాంతి చారి,వేణు యాదవ్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.