
తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వీరుడు, స్వతంత్ర సమర యోధుడు పుచ్చపల్లి సుందరయ్య జయంతిని మిరుదొడ్డి, అక్బర్పేట బొంపల్లి మండలంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాలస్వామి మాట్లాడుతూ.. తెలుగు నాటక కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖంగా కుల వ్యవస్థ నిర్మాణానికి పునాది వేసిన నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. పార్లమెంటు లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘంగా పనిచేసిన నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. కార్మికుల కర్షక పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. కార్మికులకు పని తగిన వేతనం మరియు 8 గంటల మాత్రమే చేయాలని పోరాటం చేసిన నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, సీపీఐ(ఎం) నాయకులు అంజయ్య గణేష్ నాగరాజు సుదర్శన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.