కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలిగా పూదరి రేణుక

నవతెలంగాణ – జమ్మికుంట
కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలిగా రెండవసారి జమ్మికుంట పట్టణానికి చెందిన పూదరి రేణుక శివ కుమార్  శనివారం హైదరాబాద్ గాంధీ భవన్  లో మహిళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు, కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.  నా నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ గౌడ్ , కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.